కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందిబీఆర్ఎస్ జిల్లా నాయకుడు గౌడిచర్ల వెంకటేష మండి పాటు.
రంగారెడ్డి: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తోందని, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు గౌడిచర్ల వెంకటేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గౌడిచర్ల వెంకటేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ బద్ధ పాలనను విస్మరించి, కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌పై ప్రభుత్వం పనిగట్టుకుని వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన చట్టబద్ధమైన లీజు ఒప్పందాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల నోళ్లు నొక్కేందుకు రేవంత్ రెడ్డి అక్రమ కేసులు, వేధింపులకు దిగుతోందని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంలో కక్షసాధింపు చర్యలు సరైనవి కాదని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గౌడిచర్ల వెంకటేష్ అన్నారు.